Mamata Banerjee : మంత్రి కామెంట్స్..క్షమాపణ చెప్పిన దీదీ
ద్రౌపది ముర్ముకు మమతా బెనర్జీ సారీ
Mamata Banerjee : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తక్కువ చేస్తూ టీఎంసీకి చెందిన మంత్రి అఖిల్ గిరి కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దీనిపై బీజేపీ పెద్ద ఎత్తున మండి పడింది. ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు.
తక్షణమే అఖిల్ గిరి క్షమాపణ చెప్పాలని, కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ సారీ చెప్పాలని కోరారు. దీంతో దేశ వ్యాప్తంగా టీఎంసీ మంత్రి నిర్వాకంపై ఆందోళన నెలకొంది. అంతే కాకుండా బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సోమవారం కోల్ కతా లోని రాజ్ భవన్ వరకు పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. తాను మంత్రి తరపున సారీ చెబుతున్నట్లు ప్రకటించారు. దీంతో గొడవ సద్దు మణిగింది. అందం అనేది మీరు ఎలా కనిపిస్తారనేది కాదు మీరు లోపల ఎలా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు దీదీ. ఈ వ్యాఖ్యలను తాను కూడా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తమ పార్టీలో లేదన్నారు. మంత్రిని హెచ్చరించానని, ఆయన తరపున తాను సారీ చెబుతున్నట్లు ప్రకటించారు మమతా బెనర్జీ. మాకు కూడా రాష్ట్రపతి అంటే గౌరవం ఉందన్నారు. ఇవాళ చేపట్టిన బీజేపీ పాదయాత్రకు సువేందు అధికారి నాయకత్వం వహించారు. ఇప్పటి వరకు మంత్రిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
Also Read : ఢిల్లీలో బీజేపీకి షాక్ ఆప్ లోకి జంప్