MK Stalin Lalu : లాలూతో ఎంకే స్టాలిన్ ములాఖ‌త్

పుస్త‌కాన్ని బ‌హూక‌రించిన సీఎం

MK Stalin Lalu : డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ బీహార్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నివాసంలో క‌లిశారు. క‌లైంజ‌ర్ క‌రుణానిధి ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న ప్ర‌గాఢ‌మైన అప్యాయ‌త ఉంది. ఆయ‌న త‌న‌ను అదే సానుభూతితో స్వీక‌రించార‌ని ఈ సంద‌ర్బంగా సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం లాలూతో క‌లిసిన విష‌యాన్నిపంచుకున్నారు. సామాజిక న్యాయ జ్యోతిని ఉన్న‌తంగా ప‌ట్టు కోవాల‌ని ఆకాంక్షించారు. అంద‌రికీ మార్గ నిర్దేశం చేయాల‌ని ఆయ‌న బాగుండాల‌ను తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు ఎంకే స్టాలిన్(MK Stalin).

అంత‌కు ముందు సీఎంకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్. ఆయ‌న ఇటీవ‌లే త‌మిళ‌నాడుకు వెళ్లి వ‌చ్చారు. ఇవాళ అత్యంత కీల‌కమైన స‌మావేశానికి వేదిక కానుంది బీహార్ రాజ‌ధాని పాట్నా. భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేకంగా దేశంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల నేత‌లు ఇక్క‌డికి చేరుకుంటున్నారు.

ఇప్ప‌టికే టీఎంసీ చీఫ్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా హాజ‌ర‌య్యారు. ఆమె లాలూ పాదాల‌ను తాకారు. ఇదిలా ఉండ‌గా దేశంలో కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్యామ్నాయ ప్ర‌తిప‌క్షం త‌యారు చేసేందుకు కీల‌క మీటింగ్ జ‌ర‌గ‌నుంది. దీనికి ప్లాన్ చేశారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.

Also Read : Congress Josh : కాంగ్రెస్ వైపు నేత‌ల చూపు

Leave A Reply

Your Email Id will not be published!