CM MK Stalin : రైలు ప్రమాదంపై స్టాలిన్ సమీక్ష
యుద్ద ప్రాతిపదికన పని చేస్తున్నాం
CM MK Stalin : ఒడిశా లోని బాలా సోర్ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆరా తీశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin). మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో మాట్లాడారు.
ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నైలో ఎమర్జెన్సీ సెంటర్ లో సీఎం ఎంకే స్టాలిన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు దుర్ఘటనలో తమిళనాడుకు చెందిన వారు ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారించారు సీఎం. సమావేశంలో ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. వందలాది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపమా అన్నది ఇంకా తెలియ రాలేదు.
కాగా సంఘటనా స్థలానికి మంత్రులను పంపించడం జరిగిందని చెప్పారు ఎంకే స్టాలిన్. వారు అక్కడే ఉండి సాధ్యమైనంత వరకు మృతులను, వారి కుటుంబీకులకు రక్షణగా ఉంటారని తెలిపారు. ఇదే సమయంలో బాధితులు ఎవరైనా చికిత్స పొందుతున్నట్లయితే వెంటనే చెన్నైకి తీసుకు వస్తామన్నారు స్టాలిన్. ఇందుకు సంబంధించి ఆస్పత్రులను కూడా సిద్దం చేసినట్లు స్పష్టం చేశారు సీఎం ఎంకే స్టాలిన్.
తమిళనాడు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన మృతుల్లో తమిళనాడుకు చెందిన వారు ఎవరూ లేరని తేలిందన్నారు సీఎం.
Also Read : Ajinkya Rahane