MK Stalin Slams : గ‌వ‌ర్న‌ర్ ర‌విపై సీఎం గుస్సా

ఫైల్ ను వెన‌క్కి పంపిన ర‌వి

MK Stalin Slams : మ‌రోసారి త‌మిళ‌నాడులో రాద్దాంతం మొద‌లైంది. రాష్ట్ర మంత్రివ‌ర్గంలో కీల‌క శాఖ నిర్వ‌హిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసింది. ఈ స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఆయ‌న‌కు వెంట‌నే ఛాతి నొప్పి రావ‌డం, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆయ‌న‌కు యాంజియోగ్రామ్ టెస్ట్ చేప‌ట్టారు. ఆయ‌న ప‌ట్ల ఈడీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా మంత్రి సెంథిల్ బాలాజీ కోర్టును ఆశ్ర‌యించారు.

త‌న‌ను అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని కోరుతూ. దీనిపై విచారించిన కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. సెంథిల్ బాలాజీ పిటిష‌న్ ను తిర‌స్క‌రించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. అంతే కాదు జూన్ 23 వ‌ర‌కు జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. దీంతో సెంథిల్ బాలాజీ జైలు ఊచ‌లు లెక్క పెట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా మంత్రి కి కేటాయించిన శాఖ‌ల‌ను ఇత‌ర మంత్రుల‌కు కేటాయిస్తూ సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ప్ర‌భుత్వం ఆమోదం కోసం గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వికి పంపింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఫైల్ ను తిరిగి ప్ర‌భుత్వానికి పంపించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం ఎంకే స్టాలిన్.

ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ద‌మ‌ని, రాజ్ భ‌వ‌న్ కాద‌ని ఇది ఆర్ఎస్ఎస్ భ‌వ‌నా అని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా నెల‌కొంది ప‌రిస్థితి.

Also Read : YS Sharmila : అమ‌రుల త్యాగాలు క‌ల్వ‌కుంట్ల భోగాలు

Leave A Reply

Your Email Id will not be published!