MK Stalin Governor : గ‌వ‌ర్న‌ర్ ర‌విపై స్టాలిన్ గుస్సా

పైళ్ల‌ను క్లియ‌ర్ చేయ‌క పోతే ఎలా

MK Stalin Governor : త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ గా మారి పోయింది. ఆర్ఎన్ ర‌వి వ‌చ్చాక అది మ‌రింత దూరాన్ని పెంచింది. ప్రారంభంలో బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత రాను రాను ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయికి చేరుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల యుద్దానికి తెర లేపారు. ఆపై అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌సంగం చ‌దవ‌కుండానే వెళ్లి పోయారు ఆర్ఎన్ ర‌వి. ఇది తీవ్ర వివాదానికి, రాద్ధాంతానికి దారి తీసింది. గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌భుత్వం ప‌ట్ల న‌మ్మ‌కం లేద‌ని, ప్ర‌ధానంగా ఆయ‌నకు భారత రాజ్యాంగం ప‌ట్ల ఏ మాత్రం గౌర‌వం లేద‌ని దీంతో అర్థ‌మైంద‌ని పేర్కొన్నారు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin).

ఇదే స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌లు కీల‌క ఫైళ్లు ఆగి పోయాయ‌ని ఆరోపించారు . దీనికి ప‌లుమార్లు కొర్రీలు వేస్తూ వ‌చ్చారు గ‌వ‌ర్న‌ర్. తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. మ‌రో వైపు యూనివ‌ర్శిటీల బిల్లుకు సంబంధించి ప్ర‌భుత్వం ఓ తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టించి. ఆయా యూనివ‌ర్శిటీల‌కు గ‌వ‌ర్న‌ర్ చైర్మ‌న్ గా కాకుండా సీఎం పూర్తి అధికారాలు ఉండేలా తీర్మానం చేసింది.

మ‌రో వైపు ఇటీవ‌ల మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయ‌న‌కు సంబంధించిన శాఖ‌ల‌ను ఇత‌ర మంత్రుల‌కు కేటాయిస్తూ సీఎం ఫైల్ పంపించారు. దీనిపై కూడా అభ్యంత‌రం తెలిపారు గ‌వ‌ర్న‌ర్. తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఇంకా ఫైల్స్ పై సంత‌కాలు చేయ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌జ‌ల సంక్షేమానికి ఆర్ఎన్ ర‌వి ప‌ని చేస్తున్నారంటూ ఆరోపించారు ఎంకే స్టాలిన్.

Also Read : Rahul Gandhi Jawan : మ‌ణిపూర్ లో జ‌వాన్ల కృషి భేష్

Leave A Reply

Your Email Id will not be published!