MK Stalin : హిందీపై తమిళనాడులో గరం గరం
రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు..ఆందోళనలు
MK Stalin : కేంద్ర ప్రభుత్వం హిందీని దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా తమిళనాడు భగ్గుమంటోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై మండి పడుతున్నారు తమిళ వాసులు. భారత దేశ సమగ్రతకు విరుద్దమని సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే తమిళనాడుతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తదితర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది హిందీ భాషా ప్రయోగానికి వ్యతిరేకంగా. స్టాలిన్ కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మద్దతు తెలిపారు. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ నివేదికను కేంద్రం అమలు చేయకూడదంటూ డిమాండ్ చేసింది.
ఈ మేరకు పీఎంకు, రాష్ట్రపతికి లేఖలు కూడా రాశారు సీఎం స్టాలిన్. ఇదే సమయంలో అంతకు ముందు అక్టోబర్ 13న కేంద్రం హిందీని విధించడాన్ని నిరసిస్తూ అధికార డీఎంకే యువజన , విద్యార్థి విభాగం తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తం నిరసనను ప్రకటించింది.
అంతే కాకుండా హిందీ భాష అమలుపై కేంద్రాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం ఎంకే స్టాలిన్ . ఈ మేరకు తీవ్రంగా ఖండించారు కూడా. మరో భాష యుద్దాన్ని తమపై విధించ వద్దంటూ డిమాండ్ చేశారు. ఈనెల 10న సీఎం స్టాలిన్ ట్వీట్ చేస్తూ భారత దేశంలోని వైవిధ్యాన్ని నిరాకరిస్తూ హిందీ అమలు కోసం నిర్ణయం తీసుకోవడం తమిళుల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొన్నారు.
Also Read : 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ శాఖలు