MK Stalin : ఎంకే స్టాలిన్ వైరల్
విజయకాంత్ తో అనుబంధం
MK Stalin : తమిళనాడు – డీఎంకే బాస్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నెట్టింట్లో వైరల్ గా మారారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడా భేషజాలు ప్రదర్శించని నైజం ఆయన స్వంతం. తనను విమర్శించిన వాళ్లను సైతం క్షమించే గుణం కలిగిన నాయకుడు ఆయన.
MK Stalin Viral
ఇందుకు సంబంధించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఎంకే స్టాలిన్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా ఆయన అభిమానులు ప్రస్తావిస్తున్నారు. 2020లో ఎడప్పాడి తల్లి మరణించడంతో నివాళులు అర్పించేందుకు అప్పటి సీఎం ఎడప్పాడి సేలం ఇంటికి ఎంకే స్టాలిన్ వెళ్లారు.
విచిత్రం ఏమిటంటే గతంలో ఎడప్పాడి తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో అనరాని మాటలు అన్నారు. వాటిని ఆయన పరిగణలోకి తీసుకోలేదు. రాజా తండ్రి హరిహరన్ 2017లో మరణించినప్పుడు రాజకీయ ప్రత్యర్థి అయిన హెచ్.రాజాను ఓదార్చడానికి స్టాలిన్ వెళ్లారు.
దిగ్గజ మురసోలి మారన్ చని పోయినప్పుడు సీఎంగా ఉన్న జయలలిత కనీసం సంతాపం ప్రకటించ లేదు. ఆనాటి పీఎం అటల్ బిహారి వాజ్ పేయి అంత్యక్రియలకు హాజరైనా ప్రోటోకాల్ ప్రకారం హాజరు కాలేదు.
ఇదిలా ఉండగా జయలలిత మృతి చెందిన సమయంలో ఎంకే స్టాలిన్(MK Stalin) స్వయంగా వెళ్లారు. కన్నీటి నివాళులు అర్పించారు. ఓపీఎస్ భార్య చని పోయిన సమయంలో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని సంతాపం తెలిపారు.
తాజాగా ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ తనకు ఆప్తుడైన విజయకాంత్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రోటోకాల్ ను ఉల్లంఘించి చివరి సారిగా వీడ్కోలు పలికారు. అంతిమ యాత్ర సజావుగా సాగేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
Also Read : Eatala Rajender : ప్రజలే చరిత్ర నిర్మాతలు – ఈటల