Naveen Patnaik Invite : కాంగ్రెస్ సీఎంలకు పట్నాయక్ పిలుపు
గెహ్లాట్..బఘేల్..ఎస్ఎస్ సుఖులకు ఆహ్వానం
Naveen Patnaik Invite : ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన ప్రకటన చేశారు. ఒడిశాలో జరిగే సమావేశానికి బీజేపీయేతర ముఖ్యమంత్రులను రావాలంటూ ఆహ్వానం పలికారు. ఈ పిలుపు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. రాష్ట్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి రావాల్సిందిగా నవీన్ పట్నాయక్(Naveen Patnaik) రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుతో పాటు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కు స్పెషల్ ఇన్విటేషన్ పలకడం విస్తు పోయేలా చేసింది.
పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ వచ్చే ఏడాది 2023 జనవరిలో జరగనుంది. ఈ బిగ్ ఈవెంట్ రూర్కెలాలో జరగనుంది. ఈ కార్యక్రమానికి బిజూ జనతాదళ్ చీఫ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ఆహ్వానించడం విస్తు పోయేలా చేసింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసేలా చేసింది.
ఈ ముగ్గురు సీఎంలకు ఆహ్వానం అందిన మాట వాస్తవమేనని అశోక్ గెహ్లాట్, బఘేల్ , ఎస్ ఎస్ సుఖు తప్పనిసరిగా హాజరు కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ కూడా ధ్రువీకరించింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని మరోసారి ఈ ఆహ్వానంతో రూఢీ అయ్యింది. విచిత్రం ఏమిటంటే బీజేడీ కాంగ్రెస్ వ్యతిరేక సంస్థగా ఉంది.
అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రభుత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి మిత్రపక్షంగా ఉంది. ఇది తరచుగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. ఎన్డీఏ విధానాలకు సపోర్ట్ గా ఉండడం ..విపక్షాల సీఎంలకు ఇన్విటేషన్ ఇవ్వడం ఆశ్చర్య పోయేలా చేసింది.
Also Read : చలిని లెక్క చేయని రాహుల్