Nitish Kumar : లాలూ ఆరోగ్యంపై సీఎం నితీశ్ ఆరా
ఎలా ఉన్నారంటూ పరామర్శ
Nitish Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన కూటమి భాగస్వామి అయిన ఆర్జేడీ చీఫ్ , మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను నివాసంలో కలిశారు. ఆయన ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఈ సందర్భంగా లాలూ యాదవ్ ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శించారు.
అంతా సవ్యంగా సాగడం సంతోషకరమైన విషయమని అన్నారు సీఎం. వైద్యులు కూడా బాగానే ఉన్నారని తెలిపారని చెప్పారు నితీశ్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ ను పరామర్శించిన అనంతరం నితీశ్ కుమార్(Nitish Kumar) మీడియాతో మాట్లాడారు. ఎప్పటిప్పుడు తాను డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో మాట్లాడుతూ వచ్చానని ఎంత ఖర్చు అయినా సరే వెనక్కి వెళ్ల వద్దంటూ సూచించానని తెలిపారు.
ఇదిలా ఉండగా సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆపరేషన్ జరిగింది. ఆయన కూతురు రోహిణి ఆచార్య తన కిడ్నీని దానంగా తన తండ్రికి ఇచ్చింది. ఆమె తండ్రికి దాత కావడంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రోహిణిని ఆదర్శ కుమార్తె అని ప్రశంసలు కురిపించారు.
శస్త్ర చికిత్స విజయవంతమైందని , తన తండ్రిని ఐసీయూకి తరలించామని లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. కిడ్నీ దాత సోదరి రోహిణి ఆచార్యతో పాటు తన తండ్రి లాలూ కూడా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు డిప్యూటీ సీఎం . ఇదిలా ఉండగా 74 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. దీంతో వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు.
Also Read : రాజ్యాంగ స్పూర్తి ప్రదాత అంబేద్కర్