Prashant Kishor : నితీశ్ పార్టీ చీఫ్ గా ఉండ‌మ‌న్నారు – పీకే

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఐపాక్ చీఫ్

Prashant Kishor :  ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. జ‌న‌తాద‌ళ్ యు పార్టీ చీఫ్ గా త‌న‌ను ఉండ‌మ‌ని సీఎం నితీశ్ కుమార్ కోరాడ‌ని చెప్పారు. కానీ తాను ఆ బంప‌ర్ ఆఫ‌ర్ ను వ‌దులుకున్నాన‌ని తెలిపారు.

ఇదిలా ఉండగా బీహార్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలోని ప్ర‌తి మూల‌ను క‌వ‌ర్ చేసే 3,500 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌ను చేప‌ట్టారు.

పాడ్నా నుండి 275 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప‌శ్చిమ చంపార‌న్ జిల్లా లోని మారుమూల ప్రాంతంలో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా 2018లో ప్ర‌శాంత్ కిషోర్ ను జేడీయూలో చేర్చుకున్నారు జేడీయూ చీఫ్‌,

సీఎం నితీశ్ కుమార్. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త నుండి కార్య‌క‌ర్త‌గా మారిన ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor) సీఎంపై నిప్పులు చెరిగారు.  త‌న‌ను పార్టీ నాయ‌క‌త్వం స్వీక‌రించాల‌ని కోరిన మాట వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు.

త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌న్నారు. తాను సీఎంగా బీహార్ లో కొలువు తీరాక ఎలాంటి అభివృద్ది జ‌రిగిందో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు ప్ర‌శాంత్ కిషోర్.

అయితే సీఎం ఆఫ‌ర్ ను తాను తిర‌స్క‌రించిన‌ట్లు ప్ర‌క‌టించారు. బీహార్ లో నితీశ్ కుమార్(Nitish Kumar) అత్యంత తెలివైన నాయ‌కుల్లో ఒక‌రు. విచిత్రం ఏమిటంటే సీఎంను పితృమూర్తి అని పిలుస్తారు.

2014లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఓడి పోయాక సహాయం కోసం వేడుకుంటూ ఢిల్లీలో న‌న్ను క‌లిశాడ‌ని చెప్పారు పీకే. 2015 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హా ఘ‌ట్ బంధ‌న్ సీఎంగా గెలుపొందడంలో త‌న వంతు సాయం చేశాన‌ని తెలిపారు.

Also Read : మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పురోగ‌తికి మార్గం

Leave A Reply

Your Email Id will not be published!