Nitish Kumar : కేంద్రంపై భ‌గ్గుమ‌న్న నితీశ్ కుమార్

నీతి ఆయోగ్, కొత్త పార్ల‌మెంట్ వేస్ట్

Nitish Kumar : కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar). ఆయ‌న 17 ఏళ్లుగా బీజేపీతోనే ఉన్నారు. ఇటీవ‌ల కాషాయానికి క‌టీఫ్ చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీతో జ‌త క‌ట్టారు. సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ స‌మాశాన్ని ఎనిమిది మంది సీఎంలు బ‌హిష్క‌రించారు. ఇదే స‌మ‌యంలో మే 28న ఆదివారం నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వం ఉంది. దీనిని ప్ర‌ధాని ప్రారంభించ‌నున్నారు. అటు నీతి ఆయోగ్, ఇటు పార్ల‌మెంట్ భ‌వ‌నంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు నితీశ్ కుమార్.

ఈ రెండింటి వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం త‌న‌కు కావాల్సిన విధంగా తాను నిధుల‌ను తీసుకుంటోంద‌ని కానీ ఒక్క పైసా రాష్ట్రాల‌కు ఇవ్వ‌డం లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు సీఎం. అందుకే తాను రెండింటి వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు చెప్పారు. పాట్నాలో నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కొత్త పార్ల‌మెంట్ అవ‌స‌రం ఏమిటి. ఇంత‌కు ముందు ఉన్న భ‌వ‌నం చారిత్రాత్మ‌క‌మైన‌ది.

దానిని ఎందుకు తొల‌గించాల‌ని అనుకుంటున్నారంటూ ప్ర‌శ్నించారు. కేవ‌లం వ్యాపార‌వేత్త‌ల‌కు, కాంట్రాక్ట‌ర్ల‌కు ఉప‌యోగ ప‌డేందుకే మోదీ దీనిని నిర్మించారంటూ ఫైర్ అయ్యారు బీహార్ సీఎం. క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామయ్య‌, పంజాబ్ సీఎం మాన్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం బ‌ఘేల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ , కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ హాజ‌రు కావ‌డం లేదు.

Also Read : S Jai Shankar

Leave A Reply

Your Email Id will not be published!