Nitish Kumar Lalu Yadav : లాలూ యాదవ్ కు సీఎం సపోర్ట్
సీబీఐ కేసులో సమర్థించిన నితీశ్
Nitish Kumar Lalu Yadav : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేపడుతున్న కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు (Nitish Kumar Lalu Yadav)ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో 17 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేశారు నితీశ్ కుమార్. కానీ ఉన్నట్టుండి బంధాన్ని తెంచుకున్నారు.
కాంగ్రెస్, ఆర్జేడీ, తదితర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీహార్ లో. ఇదే సమయంలో ఆర్జేడీ తరపున ఆ పార్టీ చీఫ్ తేజస్వి యాదవ్ కు డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు. ఇదే సమయంలో కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ముమ్మరం చేశారు.
యాదవ్ కుటుంబంపై అనేక ఇతర కేసులు నమోదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం నితీశ్ కుమార్. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించారు.
పది సంవత్సరాల కిందట కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా ని చేశారు లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Yadav). ఉద్యోగాల కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఈ కేసులో ఏమీ లేదని పేర్కొన్నారు నితీశ్ కుమార్(Nitish Kumar). బీజేపీ రాష్ట్రీయ జనతాదళ్ పితృస్వామ్యానికి వ్యతిరేకంగా తమ పార్టీలు జత కట్టినందు వల్లనే లాలూ ప్రసాద్ యాదవ్ వెంట పడుతున్నారంటూ ఆరోపించారు బీహార్ సీఎం. ఐదేళ్ల కిందట ఏం జరిగింది. మే ఆర్జేడీతో విడి పోయాం. ఆ కేసులో ఏమీ లేదు. ఏం జరగలేదన్నారు. అన్నీ చూశాను. అందులో ఏం లేదన్నారు.
Also Read : రాహుల్ విమర్శ గెహ్లాట్ ప్రశంస