CM Revanth met UPSC Chairman: యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ !
యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ !
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి, యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లు అధికారులు ఉన్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్ది, ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను సిఎం, అధికారులు తెలుసున్నట్లు సమాచారం. అంతేకాదు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలకు అవసరమైన పలు అంశాలపై యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో చర్చించినట్లు సమాచారం.
CM Revanth – బిజీబిజగా సిఎం రేవంత్ ఢిల్లీ పర్యటన
తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి అవసమైన నిధులు, నియామకాల కోసం పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. గురువారం పర్యటనలో భాగంగా సిఎం రేవంత్, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హర్ దీప్ సింగ్ పూరిలపే కలిసి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, నిధులు, నియామకాలు గురించి చర్చించారు. సిఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.
Also Read : ED Raids in Haryana: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా తుపాకులు..!