Prabhakar Rao EX CMD : ప్రభాకర్ రావుకు సీఎం షాక్
రాజీనామాను ఆమోదించొద్దు
Prabhakar Rao EX CMD : హైదరాబాద్ – బీఆర్ఎస్ సర్కార్ లో విద్యుత్ శాఖ పరంగా కీలక పోస్టులో కొలువు తీరిన ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే సమీక్ష చేపట్టారు.
Prabhakar Rao EX CMD Got Shock from CM
సీఎస్ శాంతి కుమారికి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ముందు జాగ్రత్తగా , వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని సీఎస్ కు అందజేశారు. విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇవాళ తన వద్దకు రావాలని ఆదేశించారు.
ప్రభుత్వ పరంగా వేల కోట్ల రూపాయల బకాయిలు ఇంకా రాలేదు. వాటిని గంప గుత్తగా నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకున్నారని, దీనికి సంబంధించి వెంటనే వివరాలు ఇవ్వాలని సీఎఎస్ కు స్పష్టం చేశారు. మరో వైపు విద్యుత్ శాఖ తో పాటు నీటి పారుదల శాఖలపై సమీక్షించనున్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
Also Read : CM Revanth Reddy : ఇక రేవంత్ ప్రజా దర్బార్