CM Revanth Reddy : ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ఆరు మంత్రి పదవులపై కసరత్తు
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డిసెంబర్ 19న మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు కొలువు తీరిన మంత్రివర్గంలో కొందరికి మాత్రమే చోటు దక్కింది. దీంతో ఇంకా ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం.
CM Revanth Reddy Will Visit Delhi
పూర్తి కేబినెట్ లో ఇంకా 6 మందికి చోటు దక్కనుంది. ఇప్పుడే భర్తీ చేస్తారా లేక లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నింపుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది ఆ పార్టీ వర్గాల్లో. ఇది పక్కన పెడితే షబ్బీర్ అలీ, జిల్లెల చిన్నారెడ్డిలకు ఛాన్స్ దక్కనుందని విశ్వసనీయ సమాచారం.
ఈ సారి ఎన్నికల్లో అనూహ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో మంచి పట్టు కలిగిన షబ్బీర్ అలీని తప్పించారు. ఆయన రూరల్ నియోజకవర్గం కేటాయించారు. ఈసారి ఓటమి పాలయ్యారు. కానీ మంచి పట్టుంది పార్టీలో. ఇదే సమయంలో తొలుత ప్రకటించిన లిస్టులో వనపర్తి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చిన్నారెడ్డిని చేర్చారు.
కానీ తూడి మేఘారెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఉన్నట్టుండి హైకమాండ్ మార్చేసింది. చిన్నారెడ్డికి టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన అత్యంత సీనియర్ నాయకుడిగా, వివాద రహితుడిగా పేరు పొందారు.
స్పీకర్ పదవి ఇస్తారని ఆశించారు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు అప్పగించారు. నాలుగు సామాజిక వర్గాలకు సంబంధించి ప్యానెల్ స్పీకర్లుగా ఖరారు చేశారు. మొత్తంగా ఆ ఆరుగురు ఎవరనేది తేలాల్సి ఉంది.
Also Read : Daggubati Purandeswari : జగన్ పాలనలో జనం గగ్గోలు