CM Revanth Reddy : పాలకులం కాదు ప్రజా సేవకులం
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – తాము పాలకులం కామని ప్రజా సేవలకుమని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. దేశంలోనే కాదు ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యమకారులకు పూర్తి భరోసా ఇస్తున్నానని అన్నారు.
CM Revanth Reddy Comment
పది సంవత్సరాల కాలంలో ప్రగతి భవన్ లోకి ప్రజలను రానీయకుండా చేస్తూ వచ్చిన కంచెలను తొలగించడం జరిగిందని చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). పార్టీకి చెందిన కార్యకర్తలను, నాయకులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు.
జై సోనియమ్మ అంటూ నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల కారణంగానే కొత్త రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇక గడీల పాలన ఉండదన్నారు. ప్రజా పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నో ఆకాంక్షలు, ఆశలతో ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్దిలో మీ ఆలోచనలు పంచు కోవచ్చన్నారు.
ఇది ప్రగతి భవన్ కాదని ప్రజా భవన్ అన్నారు రేవంత్ రెడ్డి. చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడం జరిగిందని ఇక నిరభ్యంతరంగా ఎప్పుడైనా రావచ్చని చెప్పారు .
Also Read : Revanth Reddy Sworn : సీఎంగా రేవంత్ రెడ్డి అనే నేను