CM Revanth Reddy : కొత్త హైకోర్టు భవనానికి గ్రీన్ సిగ్నల్
ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేతో పాటు ప్రముఖ న్యాయవాదులు సీఎంతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా హైకోర్టుకు సంబంధించి కొత్త భవనం నిర్మించాలని ప్రతిపాదించారు.
CM Revanth Reddy Approved
దీనిపై సానుకూలంగా స్పందించారు సీఎం . రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన హైకోర్టుకు నూతన భవనం నిర్మించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.
వచ్చే ఏడాది జనవరి నెలలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అధ్వాన్నంగా ఉందని, కనీస వసతులు, సౌకర్యాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు.
నూతన భవనం నిర్మించడం వల్ల కొంత ఇబ్బందులు తొలగి పోతాయని ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే తెలిపారు. దీనిపై వెంటనే స్పందించారు, తన సమ్మతిని తెలియ చేశారు సీఎం. 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్లాన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి.
Also Read : Seethakka Minister : మినీ అంగన్ వాడీ టీచర్లకు శుభవార్త