CM Revanth Reddy : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్తగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా ఢి్ల్లీకి వెళ్లారు. ఆయన ఏపీ భవన్ , తెలంగాణ భవన్ ల ఆస్తులకు సంబంధించి సమీక్ష చేపట్టారు. కొత్తగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఎన్ని ఎకరాల స్థలం ఉందనే దానిపై ఆరా తీశారు.
CM Revanth Reddy in Delhi
తాను ఇటీవలే మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా సీఎంగా ఉన్న తనకు కేంద్రం భవనాన్ని కేటాయించింది ఢిల్లీలో. ప్రస్తుతం 11 మందికి కేబినెట్ లో చోటు కల్పించింది పార్టీ హైకమాండ్. ఇంకా 6 మందికి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది. పార్టీ కోసం కష్టపడిన వారు కొందరికి టికెట్ రాక పోగా మరికొందరికి టికెట్లు ఇచ్చినా ఓటమి పాలయ్యారు.
దీంతో ఢిల్లీలో ఆశావహులతో నిండి పోయింది రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసం. సీఎంను కలిసిన వారిలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్, నాంపల్లిలో ఓడి పోయిన ఫిరోజ్ ఖాన్ తో పాటు షబ్బీర్ అలీ , అద్దంకి దయాకర్ , తదితరులు రేసులో ఉన్నారు.
ఇప్పటికే 54 కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, డైరెక్టర్ల పదవులన్నీ ఖాళీ అయ్యాయి. ఇటు విస్తరణలో చోటుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీల పదవులకు సంబంధించి హైకమాండ్ తో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Pawan Kalyan : ఎన్నారైల సహాయం ప్రశంసనీయం