CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణ..ఏపీ భవన్ ఆస్తుల విభజన
CM Revanth Reddy : న్యూఢిల్లీ – తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సీఎంగా కొలువు తీరాక తొలిసారి హస్తినకు రావడం. ఇప్పటికే ఒకసారి మల్కాజ్ గిరి ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పార్లమెంట్ కు వెళ్లి స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా పత్రం సమర్పించారు.
CM Revanth Reddy Meetings in Delhi
ఇదే సమయంలో ఇప్పటికీ ఇంకా ఏపీ విభజన జరిగినా, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఆస్తుల పంపకం పూర్తి కాలేదు. దీంతో తెలంగాణ, ఆంధప్రదేశ్ భవన్ ల ఆస్తుల విభజనకు సంబంధించి సీరియస్ గా సమీక్షించారు (CM Revanth Reddy)రేవంత్ రెడ్డి.
ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణంపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై వాకబు చేశారు. ప్రభుత్వ పరంగా ఏమైనా చెల్లింపులు చేయాల్సి ఉందా అని అడిగారు. అంతకు ముందు ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వచ్చిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏపీ భవన్ ను సందర్శించారు.
వచ్చే జనవరి నాటికి ఇక్కడ తెలంగాణ భవన్ నిర్మాణం కోసం భూమి పూజ ప్రారంభించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Also Read : 141 MPs Suspended : 141 మంది ఎంపీల సస్పెన్షన్