CM Revanth Reddy Review : ఇక ప్రజావాణి రెండు రోజులు
స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి ప్రజావాణి వారంలో రెండు రోజుల పాటు నిర్వహించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారికి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం వారంలో సోమవారం మాత్రమే ప్రజా వాణి చేపట్టేవారు. కానీ సీన్ మారింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Review on Issues
ఆయన సీఎంగా కొలువు తీరాక పాలనా పరంగా దూకుడు పెంచారు. సచివాలయంలో కీలక శాఖలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడు గంటలకు పైగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో కలిసి చర్చించారు. సాధ్యా సాధ్యాల గురించి ఆరా తీశారు. వెంటనే రైతు భరోసా కింద నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.
ప్రజా దర్బార్ స్థానంలో ప్రజా వాణి ఉంటుందని , దీనిని ఒక రోజు కాకుండా వారంలో రెండు రోజుల పాటు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. దీని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను నమోదు చేయాలని స్పష్టం చేశారు.
Also Read : England Test Team 2023 : ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ఇదే