CM Revanth Reddy : కొత్త వాహనాలు కొనుగోలు చేయం
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. అయితే ఎంసీఆర్హెచ్ఆర్డీ లో ఖాళీగా ఉన్న స్థలాన్ని సర్కార్ అవసరాల కోసం వినియోగించు కుంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Comment about New Vehicles
అంతే కాకుండా ప్రజా భవన్ లోని ఆఫీసులను కూడా ఉపయోగించు కుంటామని తెలిపారు సీఎం. కొత్తగా ఎలాంటి భవనాలను నిర్మించు కోదల్చు కోలేదని పేర్కొన్నారు. ఇప్పటికే గతంలో కొలువు తీరిన ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఖజానాపై అదనపు భారం పడుతోందన్నారు రేవంత్ రెడ్డి.
శాసన సభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ 13 గంటలకు మించి విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ప్రజలను మోసం చేశారని, మాయ మాటలతో నమ్మించారని ఆరోపించారు. ఇన్ని కోట్లు విద్యుత్ సంస్థలో అప్పులు ఎలా ఉంటాయో చెప్పాలన్నారు సీఎం.
అన్ని అంశాలపై ప్రస్తుతం అందరితో చర్చిస్తామని, సమయం వచ్చినప్పుడు శ్వేత పత్రం విడుదల చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : Botsa Satyanarayana : జనం బాబును నమ్మరు – బొత్స