CM Revanth Reddy Signs : సీఎం సంత‌కం ర‌జ‌నీకి ఉద్యోగం

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Signs : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా గురువారం ఎనుముల రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి అశేష ప్రజానీకం హాజ‌ర‌య్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. సోనియా గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ తో పాటు కీల‌క నేత‌లు వేదిక మీద ఆసీనుల‌య్యారు.

CM Revanth Reddy Signs No 1

రేవంత్ రెడ్డితో పాటు భ‌ట్టి విక్ర‌మార్క డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు. వీరితో పాటు మ‌రో 10 మంది కేబినెట్ మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరంద‌రితో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

సోనియా, రాహుల్, ఖ‌ర్గే, ప్రియాంక, హిమాచాల ప్ర‌దేశ్ సీఎంల‌కు వీడ్కోలు ప‌లికారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. తాము పాల‌కులం కామ‌ని ప్ర‌జా సేవ‌కుల‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా ఎప్పుడైనా ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు రావ‌చ్చ‌న్నారు. గ‌డీలు ఉండ‌వ‌ని, బారికేడ్ల‌ను కూల్చి వేశామ‌న్నారు.

ఇచ్చిన మాట ప్ర‌కారం అభ‌య హ‌స్తంకు సంబంధించి తొలి సంత‌కం చేశారు. అనంత‌రం దివ్యాంగురాలు టి. ర‌జ‌నికి ఉద్యోగ నియామ‌క ఫైల్ పై సిగ్నేచ‌ర్ చేశారు.

Also Read : CM Revanth Reddy : పాల‌కులం కాదు ప్ర‌జా సేవ‌కులం

Leave A Reply

Your Email Id will not be published!