CM Revanth Reddy : బ్యారేజీల కుంగుబాటుపై విచారణ
ప్రకటించిన ఎనుముల రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటి ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుంగి పోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని వెల్లడించారు.
CM Revanth Reddy Comment
అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన ఈ ప్రకటన బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. శాసన సభ సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి మేడిగడ్డ పర్యటనకు తీసుకు వెళతానని స్పష్టం చేశారు సీఎం.
ఎందుకు మేడిగడ్డ కుంగి పోయింది, ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు . కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి.
కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో కూడా విచారణలో తేలుతుందన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియ చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. వారి వెనుక ఉన్న మాజీ మంత్రులు ఎవరనేది కూడా తేలుతుందన్నారు.
ఇదే సమయంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెప్పారని సభ సాక్షిగా మండిపడ్డారు సీఎం. వాస్తవానికి చూస్తే రాష్ట్రం తలసరి విద్యుత్ వినియోగంలో 5వ స్థానంలో ఉందన్నారు .
Also Read : Bhatti Vikramarka : ఘనంగా క్రిస్మస్ వేడుకలు – భట్టి