CM Revanth Reddy : కేసీఆర్ ను పరామర్శించిన సీఎం
ఎలా ఉందంటూ రేవంత్ రెడ్డి ఆరా
CM Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అంతకు ముందు రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు.
CM Revanth Reddy Meet KCR
కేసీఆర్ వెంట ఉన్నారు రాజ్య సభ సభ్యుడు సంతోష్ రావు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. ఇదిలా ఉండగా ఓటమి అనంతరం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లకుండా రాజీనామా సమర్పించ కుండానే నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లి పోయారు.
ఇక్కడ బాత్రూంలో కేసీఆర్ జారి పడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగింది. ఆయనను హుటా హుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్య బృందం పేర్కొంది.
నిన్న శస్త్ర చికిత్స పూర్తయింది. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన పని లేదని పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లారు. కేసీఆర్ ను పరామర్శించడం విశేషం.
Also Read : Ponnam Prabhakar : కేసీఆర్ ఆరోగ్యంపై పొన్నం పరామర్శ