Yadadri : యాదాద్రి ప‌నుల పురోగ‌తిపై సీఎం ఆరా

మార్చిలో పున‌ర్ ప్రారంభోత్స‌వం

Yadadri : సీఎం కేసీఆర్ యాదాద్రికి ఇవాళ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి ని ద‌ర్శించుకున్నారు. ఆల‌య ఈఓతో పాటు పండితులు, పూజారులు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు.

శాలువా క‌ప్పి ఆశీర్వ‌దించారు. అనంత‌రం ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేని రీతిలో ఆల‌యాన్ని పున‌ర్ నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున ఆల‌యానికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చేందుకు సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నం చేశారు.

ఇందులో భాగంగా పున‌ర్ నిర్మాణ ప‌నుల ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఉన్నతాధికారులు కేసీఆర్ కు నిర్మాణ ప‌నుల గురించి వివ‌రించారు. ప్ర‌స్తుతం సీఎం బాలాల‌యంలో ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌చ్చే మార్చి 28న మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని ముహూర్తం కూడా నిర్ణ‌యించింది. దీంతో ఆ దిశ‌గా ఏర్పాట్లు సాగుతున్నాయా లేదా అన్న దానిని ప‌రిశీలించారు కేసీఆర్.

రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. ఈ మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున రిత్వికులు, అర్చ‌కులు, పండితులు, ప్ర‌ముఖులతో దేశంలోని పీఠాధిప‌తులు కూడా హాజ‌రు కానున్నారు.

ఆరోజు జ‌రిగే మ‌హా కుంభ సంప్రోక్ష‌ణను పుర‌స్క‌రించుకుని సుద‌ర్శ‌న యాగం, త‌దిత‌ర ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ప‌లు సూచ‌న‌లు ఈ సంద‌ర్భంగా చేశారు.

ఇక యాదాద్రిని(Yadadri) కొడ‌పైన కొండ కింద ప‌లు ప‌నుల నిర్మాణం పూర్తి కావ‌చ్చింది. దాదాపు అన్న పూర్త‌య్యాయి. ఈ నిర్మాణ ప‌నుల‌న్నీ జ‌గత్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతున్నాయి.

సీఎం టూర్ సంద‌ర్భంగా వైటీడీఏ భారీ ఏర్పాట్లు చేసింది.

Also Read : స‌మ‌తామూర్తి మార్గం ఆచ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!