CM Shinde : బస్సు ప్రమాదం బాధాకరం – సీఎం
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
CM Shinde : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానా వద్ద ఎక్స్ ప్రెస్ వే పై పూణేకు 33 మంది తో వెళుతున్న బస్సు స్తంభాన్ని ఢీకొట్టింది. బోల్తా పడింది. ఈ ఘటనలో టైర్లు పగిలి పోయాయి. మంటలు చెలరేగాయి. 25 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్క డ్రైవర్ మాత్రమే బతికి బయట పడ్డాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే(CM Shinde). ప్రమాదం జరగడం బాధకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు. ఎలాంటి సహాయమైనా, ఎంత ఖర్చు కైనా వెనుకాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చని పోయిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు షిండే.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించి కుటుంబాలకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఎలా జరిగిందన్న దానిపై విచారణకు ఆదేశించామన్నారు సీఎం ఏక్ నాథ్ షిండే. ఏది ఏమైనా ఇలాంటి ఘటన జరగడం తనను ఎంతగానో కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారు. ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రూ. 2 లక్షలు సాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : PM Modi Condolence : బస్సు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
