CM Shinde : తండ్రిని మరిచి పోయిన ఉద్దవ్ ఠాక్రే
షాకింగ్ కామెంట్స్ చేసిన మరాఠా సీఎం
CM Shinde : మరాఠాలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై నోరు పారేసుకున్న శివసేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ ,మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేపై నిప్పులు చెరిగారు మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే. రోజు రోజుకు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. శివసేన పార్టీకి ఎలాంటి విలువలు లేవన్నారు. 2019లోనే మరాఠా యోధుడు బాల్ ఠాక్రే ఆలోచనలను విడిచి పెట్టాడని, ఇక ఆయనను ఎవరు గుర్తు పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు సీఎం.
ఆయన అత్యాసకు పోయాడు. అన్నింటినీ మరిచి పోయాడు. కేవలం పదవి కావాలని అనుకున్నాడు. చివరకు గత్యంతరం లేక తాము పార్టీని వీడాల్సి వచ్చిందన్నాడు ఏక్ నాథ్ షిండే(CM Shinde). ఇప్పుడు కాలం చెల్లిన రూపాయి మాదిరిగా ఉద్దవ్ ఠాక్రే పరిస్థితి తయారైందని మండిపడ్డారు. తమతో పోటీలో నిలబడే సత్తా ఆయనకు కానీ, ఆ పార్టీకి కానీ లేదన్నారు. సీఎం కుర్చీ కోసం మిత్ర ధర్మాన్ని పాటించని ఉద్దవ్ ఠాక్రేకు దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రశ్నించే హక్కు లేదని స్పష్టం చేశారు ఏక్ నాథ్ షిండే. ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే మహా వికాస్ అఘాడీలో భాగస్వామ్య పార్టీ అయిన ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. అజిత్ పవార్ శరద్ పవార్ పై ధిక్కార స్వరం వినిపించారు. చివరకు తమదే అసలైన ఎన్సీపీ అని ప్రకటించారు. 24 మంది ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ లో ప్రత్యక్షం అయ్యారు. ఆ వెంటనే షిండే సర్కార్ కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు పవార్.
Also Read : Joseph Vijay : పాలిటిక్స్ వైపు విజయ్ చూపు