CM Siddaramaiah : ఇందిరమ్మ క్యాంటీన్లు..పెన్షన్లు – సీఎం
సిద్దరామయ్య సంచలన ప్రకటన
CM Siddaramaiah : కర్ణాటకలో 136 సీట్లు కైవసం చేసుకుని ఏకైక మెజారిటీ సాధించిన పార్టీగా ప్రభుత్వాన్నిఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. రెండోసారి సీఎంగా సిద్దరామయ్య(CM Siddaramaiah) ఎన్నికయ్యారు. శనివారం బెంగళూరు లోని కంఠీరవ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్బంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము ఎన్నికల సందర్భంగా ప్రకటించిన అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు.
ఆదివారం సీఎంగా కొలువు తీరిన సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటిలోని మహిళకు ప్రతి నెలా రూ. 2,000 పెన్షన్ ఇస్తామని తెలిపారు. అంతే కాకుండా పేద కుటుంబానికి ప్రస్తుతం 4 కేజీలు ఇస్తున్నారని తాము 6 కేజీలు పెంచి ప్రతి నెలా 10 కేజీల బియ్యం అందజేస్తామని ప్రకటించారు.
ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో మహిళందరికీ ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రతి నెలా రూ. 3 వేల పెన్షన్ , డిప్లొమా హోల్డర్లకు రూ. 1,000 పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు సిద్దరామయ్య. ఎంతో మంది కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, దిగువ మధ్యతరగతి ప్రజలకు తినేందుకు తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారని వారి కోసం ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు సీఎం.
Also Read : YS Sharmila