UT Khader Speaker : అరుదైన దృశ్యం అభినంద‌నీయం

కొత్త స్పీక‌ర్ యుటీ ఖ‌ధీర్ కు ప్ర‌శంస‌లు

UT Khader Speaker : క‌ర్ణాట‌క అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. నూత‌న స్పీక‌ర్ గా యుటీ ఖ‌దీర్(UT Khader) ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై, కొత్త‌గా కొలువు తీరిన సీఎం సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ తో పాటు అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు , మంత్రులు ప్ర‌త్యేకంగా యుటీ ఖ‌దీర్ ను అభినందించారు.

ఇదిలా ఉండ‌గా నిన్న‌టి దాకా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. కేసుల దాకా వెళ్లింది. కానీ ఇవాళ మాత్రం సీఎం , డిప్యూటీ సీఎం, మాజీ సీఎంలు ఒకే వేదిక‌పై క‌లిసి ఉండ‌డం అసెంబ్లీకి వ‌న్నె తెచ్చేలా చేసింది. ఇలాంటి వాతావ‌ర‌ణం కేవ‌లం ప్ర‌జాస్వామ్యంలోనే సాధ్య‌మ‌వుతుంద‌ని వీరు నిరూపించారు.

రాబోయే కాలంలో ప్ర‌తిప‌క్షం, అధికార పక్షం క‌లిసి ప‌ని చేయాల‌ని క‌ర్ణాట‌క రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలోకి తీసుకు వెళ్లేలా కృషి చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ప్ర‌స్తుతం డీకే శివ‌కుమార్, సిద్ద‌రాయ్య‌, బ‌స్వ‌రాజ్ బొమ్మై క‌లిసి ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వైర‌ల్ గా మారాయి.

ఈ సంద‌ర్భంగా డీకే శివ‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్పీక‌ర్ గా యూటీ ఖాద‌ర్ కొలువు తీర‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై నిర్మాణాత్మ‌క చ‌ర్చ జ‌రిగే వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : Arvind Kejriwal

 

Leave A Reply

Your Email Id will not be published!