CM Siddaramaiah : గృహ జ్యోతి పథకానికి శ్రీకారం
కలబుర్గిలో ప్రారంభించిన సీఎం
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్య శనివారం ప్రతిష్టాత్మకమైన పేదలకు లబ్ధి చేకూర్చే గృహ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంగా 5 హామీలను ఇచ్చారు. ఇందులో భాగంగా పార్టీ నిర్ణయించిన మేరకు ప్రభుత్వం అమలు చేసే ప్రక్రియలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే 20 కిలోమీటర్ల పరిధిలో రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే వీలును కల్పించారు సిద్దరామయ్య.
CM Siddaramaiah Said
ఇప్పటికే ఇలాంటి పథకమే ఢిల్లీలో కొనసాగుతోంది. ఆప్ సర్కార్ దీనిని తీసుకు వచ్చింది. ఇక రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా సీఎం కలబుర్గిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు కలబుర్గి జిల్లా కలెక్టర్ ఫౌజియా తరన్నమ్. ఈ సందర్భంగా సీఎం(CM Siddaramaiah)కు జ్ఞాపికను అందజేశారు.
సిద్దరామయ్య రాక సందర్భంగా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లను కైవసం చేసుకుంది. పవర్ లోకి వచ్చింది. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య. ఆరు నూరైనా సరే రాష్ట్రంలో ఏ ఒక్కరూ పేదరికంతో, ఆకలితో ఉండ కూడదని తన ఆశయమన్నారు.
Also Read : Peddireddy Ramachandra Reddy : హింసకు చంద్రబాబే కారణం