CM Siddaramaiah : అస‌మాన‌త‌లు లేని స‌మాజం కావాలి

పిలుపునిచ్చిన సీఎం సిద్ద‌రామ‌య్య

CM Siddaramaiah : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశానికి 75 ఏళ్ల‌యింది స్వాతంత్రం వ‌చ్చి. కానీ ఇంకా అస‌మాన‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌మాజంలో చోటు చేసుకున్న ఈ రుగ్మ‌త‌ల‌ను, వివ‌క్ష‌ను రూపు మాపేందుకు ప్ర‌య‌త్నం చేయ‌క పోతే దేశానికి ల‌భించిన స్వేచ్ఛా సౌధాన్ని ఈ దేశ ప్ర‌జ‌లు ధ్వంసం చేస్తార‌ని డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ హెచ్చ‌రించార‌ని గుర్తు చేశారు సిద్ద‌రామ‌య్య. ఈ హెచ్చరిక‌ల‌ను ఆషా మాషీగా తీసుకోవ‌ద్ద‌ని కోరారు సీఎం.

ఇవాళ కులం, మ‌తం ప్రాతిప‌దిక‌న ప్ర‌జ‌ల‌ను అంచ‌నా వేస్తున్నారు. దీంతో మెజారిటీ వ‌ర్గం ప్ర‌జ‌లు అక్ష‌రాస్య‌త‌కు దూరంగా ఉన్నార‌ని ఆవేద‌న చెందారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం అస‌మాన‌త‌లు ఇంకా ఉండ‌డ‌మే. ఈ వ్య‌త్యాసాన్ని సాధ్య‌మైనంత తొంద‌ర‌గా రూపు మాపేందుకు య‌త్నించాల‌ని సూచించారు సిద్ద‌రామ‌య్య‌(Siddaramaiah). ఆ దిశ‌గా కృషి చేయ‌క పోతే ప్ర‌జా ప్ర‌తినిధులుగా , ఐఏఎస్ – కేఏఎస్ అధికారులుగా ఉండీ ఏం ప్ర‌యోజ‌నం అంటూ ప్ర‌శ్నించారు సీఎం.

జ‌వాబుదారీత‌నం ఉన్న అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల అవ‌స‌రం ఈ దేశంలో పెరిగింద‌ని చెప్పారు. బాధ్య‌త లేకుండా ఆ ప‌ద‌విలో ఉండేందుకు అన‌ర్హులు అని పేర్కొన్నారు సీఎం. ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధిగా ప‌ని చేయాల్సిన బాధ్య‌త ఐఏఎస్ , కేఏఎస్ అధికారుల‌పై ఉంద‌న్నారు. ఆదివారం బెంగ‌ళూరు లోని ఇన్ సైట్ ఐఏఎస్ అకాడ‌మీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో యూపీఎస్స్సీ ప‌రీక్ష‌లో పాసైన వారిని అభినందించారు సీఎం.

Also Read : YS Jagan YSR : నాన్నే నా బ‌లం బ‌ల‌గం – జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!