CM Siddaramaiah : ‘అర‌సు’ జీవితం ఆద‌ర్శ ప్రాయం – సీఎం

దివంగ‌త సీఎంకు సిద్ద‌రామ‌య్య నివాళి

CM Siddaramaiah : క‌ర్ణాట‌క మాజీ సీఎం, దివంగ‌త దేవ‌రాజు అర‌సు వ‌ర్దంతి సంద‌ర్బంగా ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు సీఎం సిద్ద‌రామ‌య్య‌(CM Siddaramaiah). మంగ‌ళ‌వారం నివాళులు అర్పించిన అనంత‌రం సీఎం మాట్లాడారు. త‌న జీవిత కాలంలో ఎక్కువ‌గా ప్ర‌భావానికి లోనైన నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే ఆయ‌న దేవ‌రాజు అర‌సు అని చెప్పారు. ఎంతో అనుభ‌వం క‌లిగిన రాజ‌కీయ వేత్త‌. అరుదైన నేత‌. సీఎంగా ఆయ‌న జీవించిన కాలంలో అర‌సు చేసిన కృషి మ‌నంద‌రికీ స్పూర్తి దాయ‌క‌మ‌ని కొనియాడారు సిద్ద‌రామ‌య్య‌.

అనేక సామాజిక‌, విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని ప్ర‌శంసించారు. సామాజిక న్యాయం కోసం ప‌రి త‌పించాడ‌ని తెలిపారు. భూ సంస్క‌ర‌ణ‌ల చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త దేవ‌రాజు అర‌సుదేన‌ని చెప్పారు సిద్ద‌రామ‌య్య‌. రైతు రుణ మాఫీ చ‌ట్టానికి ఆద్యుడు ఆయ‌నేన‌ని గుర్తు చేశారు. హ‌వ‌నూరు క‌మీష‌న్ ఏర్పాటు చేసి వెనుక‌బ‌డిన కులాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన మ‌హోన్న‌త రాజ‌కీయ నాయ‌కుడు దేవ‌రాజు అర‌సు అని స్ప‌ష్టం చేశారు సీఎం. ఆయ‌న జీవించినంత కాలం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేశార‌ని, వారంతా బాగుండాల‌ని కోరుకున్నాడ‌ని తెలిపారు.

ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా చేశారు. ప్రాతినిధ్యం క‌ల్పించి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేసే మ‌హ‌త్ భాగ్యాన్ని దేవ‌రాజు అర‌సు చేశారంటూ కొనియాడారు సిద్ద‌రామ‌య్య‌. అధికారం కొంద‌రికే కాదు అంద‌రికీ రావాల‌ని న‌మ్మాడ‌ని, రైతు భూమికి య‌జ‌మాని అని స్ప‌ష్టం చేసిన ఏకైక సీఎం అత‌నేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఆయ‌న చేసిన కృషికి తాను శిర‌స్సు వంచి న‌మ‌స్కరిస్తున్నాన‌ని తెలిపారు.

Also Read : KTR : బొమ్మ‌ల త‌యారీ పార్క్ తో ఉపాధి

Leave A Reply

Your Email Id will not be published!