CM Siddaramaiah : ఈ ఏడాది లోనే హామీల అమలు – సీఎం
ప్రకటించిన కర్ణాటక సిద్దరామయ్య
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన 5 హామీలను ఈ ఏడాది లోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీజేపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మొన్నే కేబినెట్ కొలువు తీరింది. ఇంకా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసు కోవాలంటే కొంత సమయం పడుతుందన్నారు. పథకాలు అమలు కావాలంటే సమర్థవంతమైన అధికారుల సహకారం కూడా అవసరం అవుతుందని చెప్పారు సీఎం.
ఇవాళ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. మొత్తం ఐదు హామీలపై కూలంకుషంగా చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వీటిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను, కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హామీ కార్డులపై సంతకం చేశామన్నారు సిద్దరామయ్య(CM Siddaramaiah). హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు.
ఉచిత విద్యుత్ పథకం గృహ స్థాయిలో వార్షిక వినియోగంపై ఆధారపడి ఉంటుందన్నారు. నెల వారీ సగటును లెక్కిస్తామని, దానికి అదనంగా 10 శాతం కలుపుతామని తెలిపారు. ఫైనల్ అయితే విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు సిద్దరామయ్య.
ప్రతి కుటుంబానికి నెల వారీగా రూ. 2 వేలు పెన్షన్ ఇస్తామని, పేద కుటుంబానికి 10 కిలోల బియ్యం, నిరుద్యోగులకు రూ. 3 వేల పెన్షన్, డిప్లొమా చదివిన వారికి రూ. 1500 ఇస్తామన్నారు. ప్రభుత్వ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు సీఎం సిద్దరామయ్య.
Also Read : Bandi Sanjay