CM Siddaramaiah : ఉచిత విద్యుత్ అమ‌లు చేస్తాం – సీఎం

ప్ర‌క‌టించిన సిద్ద‌రామయ్య

CM Siddaramaiah : క‌ర్టాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాము ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ఐదు హామీల‌ను అమ‌లు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని అన్నారు. బుధ‌వారం సీద్ద‌రామ‌య్య(Siddramaiah) మీడియాతో మాట్లాడారు. 200 యూనిట్ల వ‌ర‌కు పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు ఉచిత‌గా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎలాంటి బిల్లులు చెల్లంచాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

అయితే వినియోగ‌దారుల‌కు సంబంధించి వారి 12 నెల‌ల స‌గ‌టు విద్యుత్ వినియోగం లెక్కించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు సీఎం. 200 యూనిట్ల లోపు ఏదైనా ఉచిత‌మేన‌ని పేర్కొన్నారు . ఓన‌ర్లే కాకుండా ఆయా అద్దెకు ఉంటున్న వారికి కూడా ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. అయితే ఆర్ఆర్ నంబ‌ర్ కు ప‌త్రాల‌ను జ‌త ప‌ర్చాల‌ని సూచించారు. ఇందుకు గాను ఓట‌ర్ గుర్తింపు కార్డు కూడా ప‌ని చేస్తుంద‌ని వెల్ల‌డించారు సిద్ద‌రామ‌య్య‌.

గ‌త ప్ర‌భుత్వం బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం అన్ని బిల్లుల‌ను నిలిపి వేశామ‌ని చెప్పారు. ఈ మేర‌కు మొత్తం ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని తెలిపారు. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా పాల‌న ఉంటుంద‌న్నారు సిద్ద‌రామ‌య్య‌(Siddaramaiah). ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ ప‌థ‌కాలు వంద శాతం అమ‌లు చేసి తీరుతామ‌న్నారు సీఎం.

రాష్ట్రంలో అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌న్నారు. గ‌తంలో ఎవ‌రైనా స‌రే అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డితే వారిపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్పష్టం చేశారు. ప్ర‌జ‌లు త‌మ‌పై న‌మ్మ‌కం ఉంచి ప‌వ‌ర్ క‌ట్ట‌బెట్టార‌ని వారి రుణం తీర్చుకుంటామ‌న్నారు సిద్ద‌రామ‌య్య‌.

Also Read : Wrestlers Demand : ఠాకూర్ ముందు ఐదు డిమాండ్లు

 

Leave A Reply

Your Email Id will not be published!