CM Siddarmaiah : డీజీపీల పాత్ర కీలకం – సీఎం
లా అండ్ ఆర్డర్ ప్రధానం
CM Siddarmaiah : బెంగళూరు – శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఆయా రాష్ట్రాలలో డీజీపీలు కీలక పాత్ర ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. బుధవారం రాష్ట్ర రాజధాని బెంగళూరులో దక్షిణ భారత రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరల్స్ సమన్వయ సదస్సును సీఎం ప్రారంభించారు.
CM Siddarmaiah Comments
ఈ సదస్సులో రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ , రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్ పాల్గొన్నారు. వీరితో పాటు దక్షిణాదికి చెందిన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ , కేరళ రాష్ట్రాలకు చెందిన డీజీపీలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సదస్సును ప్రారంభించిన అనంతరం సీఎం సిద్దరామయ్య(CM Siddarmaiah) ప్రసంగించారు. ప్రతి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దిలో ఇదే కీలకం కానుందన్నారు సీఎం.
దేశం కానీ లేదా రాష్ట్రం కానీ మున్ముందుకు సాగాలన్నా లేదా అభివృద్ది పథంలో పయనించాలంటే శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యత పూర్తిగా డీజీపీల చేతుల్లో ఉంటుందన్నారు.
వారిపై గురుతరమైన బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య. ఈ సందర్బంగా పాల్గొన్న డీజీపీలను ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : Tirumala Hundi : భారీగా శ్రీవారి హుండీ ఆదాయం