Yogi Adityanath : ల్యాండ్ మాఫియాపై యోగి కన్నెర్ర
ఎవరైనా సరే తోలు వల్చండని ఆదేశం
Yogi Adityanath Land Mafia : ఉత్తర ప్రదేశ్ లో ఏ మాఫియా ఉండేందుకు వీలు లేదని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఇప్పటికే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. తాను రెండోసారి సీఎంగా కొలువు తీరాక రాష్ట్ర రూపురేఖలు మార్చి వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు యూపీ అంటేనే ల్యాండ్ మాఫియాకు, నేరస్తులకు పేరుండేది. ఇప్పుడు అక్రమార్కులపైకి నేరుగా బుల్ డోజర్లను ప్రయోగిస్తున్నారు సీఎం. దీంతో యూపీకి ఇప్పుడు కొత్త పేరు వచ్చింది బుల్ డోజర్ల సర్కార్ గా మారి పోయింది.
ఏ పార్టీకి చెందిన వారైనా జంకుతున్నారు. ప్రతిపక్ష ఎస్పీకి చుక్కలు చూపిస్తున్నారు యోగి ఆదిత్యానాథ్. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ల్యాండ్ మాఫియా లేకుండా చూడాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎవరినీ ఉపేక్షించవద్దని సూచించారు. కేసులు నమోదు చేస్తే ఎవరైనా సిఫారసు చేసినా వారిపై కూడా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు సీఎం(Yogi Adityanath Land Mafia) .
భూ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులపై త్వరితగతిన , సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందుకు గాను ఏ ఒక్క ఫిర్యాదు లేదా దరఖాస్తు పెండింగ్ లో ఉండేందుకు వీలు లేదన్నారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath Land). ఇందుకు సంబంధించిన దరఖాస్తు లేఖలను అందజేయడం విశేషం. మంగళవారం తన నియోజకవర్గం గోరఖ్ పూర్ లో జనతా దర్శన్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు సీఎం. భూమాఫియాకు గుణపాఠం చెప్పాలన్నారు.
Also Read : దేశంలో డెమోక్రసీకి ఢోకా లేదు