CM Yogi & Akhilesh : అఖిలేష్ కామెంట్స్ యోగి సీరియస్
అసభ్య పదాలు వాడితే ఒప్పుకోం
CM Yogi & Akhilesh : ఇది అసెంబ్లీ ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. ఎంత ప్రతిపక్ష నాయకుడి వైనా రూల్స్ పాటించాల్సిందే. నీ గూండాయిజం బయట ఇక్కడ కాదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్.
శాసనసభలో సమాజ్ వాది పార్టీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్ పార్లమెంటరీ (అసభ్య) పదాలు వాడారు. బెదిరింపులకు దిగాడు. దీంతో సీఎం యోగి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్(CM Yogi & Akhilesh) , కేపీ మౌర్యల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో యోగి ఎంటర్ కావాల్సీ వచ్చింది.
అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కామెంట్స్ చేయడం ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ అభ్యంతరం చెప్పారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ, సమాజ్ వాది పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది.
బెదిరింపు ధోరణితో మాట్లాడిన మాటలను ప్రొసీడింగ్స్ లో భాగం చేయొద్దంటూ స్పష్టం చేశారు సీఎం. ఈ మేరకు స్పీకర్ కు సూచించారు. ఇది ప్రజాస్వామ్యానికి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే చెప్పాలి. లేదంటే ప్రశ్నించాలి. అంతే కాని నోరు ఉంది కదాని పారేసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు యోగి ఆదదిత్యానాథ్(CM Yogi & Akhilesh).
గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో చేసిన నిర్వాకాల గురించి ఏకరవు పెట్టారు డిప్యూటీ సీఎం. ప్రతిపక్ష నాయకుడికి ఏదైనా వ్యాధి ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది.
ఆయనకు మంచి వైద్యం అందించాలి. ఐదేళ్లు దూరంగా ఉన్నారు అధికారానికి. మరో 25 ఏళ్లు కూడా దూరంగా ఉంటారని అనడంతో ఫైర్ అయ్యారు అఖిలేష్ యాదవ్.
Also Read : మంత్రి అనిల్ పరబ్ ఇంట్లో ఈడీ సోదాలు