Yogi Adityanath Modi : యూపీలో ఎన్నికల పర్వం ముగిసింది. భారతీయ జనతా పార్టీ 273 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. సీఎంగా యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath Modi) మరోసారి కొలువు తీరనున్నారు.
ఇప్పటికే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు.
మరోసారి ఆయనే సీఎం కానున్నారు. అంతకు ముందు ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
పనిలో పనిగా ట్రబుల్ షూటర్ అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో కూడా ములాఖత్ కానున్నారు. ఈ కీలక భేటీలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీని ఖరారు చేయనున్నారు.
ఈసారి కేబినెట్ కొత్తగా ఉండనుంది. గతంలో ఉన్న వారు ఉండక పోవచ్చని సమాచారం. కొత్త ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు కొత్త ముఖాలకు ఈసారి నూతన మంత్రివర్గంలో కొలువు తీరనున్నారు.
యోగి ఆదిత్యానాథ్ తో పాటు రాష్ట్ర బీజేపీ చీఫ్ రతన్ దేవ్ సింగ్ ,మంత్రి సునీల్ బన్సాల్ , రాష్ట్ర ఇన్ చార్జ్ రాధా మోహన్ సింగ్ కూడా ఢిల్లీకి రానున్నారు.
భారతీయ జనతా పార్టీ తన మంత్రివర్గంలో ప్రతి కులానికి స్థానం కల్పిస్తోంది. అర్హతలు, కులం, ప్రాంతీయ సమీకరణాల ప్రాతిపదికన డిప్యూటీ సీఎంలు, మంత్రుల ప్రాథమిక జాబితాను సిద్దం చేసిందని ప్రచారం జరుగుతోంది.
ఈ జాబితాపై కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం తీసుకోనుంది. డిప్యూటీ సీఎం రేసులో దేవ్ సింగ్ , బేబీ రాణి మౌర్య, బ్రిజేష్ పాఠక్ , కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ఉన్నాయి. దేవ్ సింగ్ ప్రస్తుతం బీజేపీ చీఫ్ గా కూడా ఉన్నారు.
Also Read : కాంగ్రెస్ ముందు టీఎంసీ ఎంత