CM Yogi : భాగ్య‌ల‌క్ష్మి అమ్మ వారిని ద‌ర్శించుకున్న యోగి

భారీ ఎత్తున క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు

CM Yogi : తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ పూర్తిగా కాషాయ మ‌యం అయి పోయింది. ఎక్క‌డ చూసినా పార్టీ జెండాలు రెప రెప లాడుతున్నాయి. ఓ వైపు గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు , మ‌రో వైపు బీజేపీ ఫ్లెక్సీల‌తో హోరెత్తిస్తున్నారు.

మొత్తం నాలుగు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. శ‌నివారం జ‌రిగిన మీటింగ్ లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు దేశంలోని 18 మంది సీఎంలు, కేంద్ర మంత్రులు, ప‌దాధికారులు, జాతీయ స్థాయి నేత‌లు హాజ‌ర‌య్యారు.

ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్ లోని ప‌రేడ్ గ్రౌండ్ లో భారీ బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో పార్టీ స‌మావేశాల‌కు ప్ర‌త్యేకంగా హాజ‌ర‌య్యారు యూపీ సీఎం , డైన‌మిక్ లీడ‌ర్ గా పేరొందిన యోగి ఆదిత్యానాథ్(CM Yogi).

ఇదిలా ఉండ‌గా నిన్న హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీలో ఉన్న పేరొందిన భాగ్య‌ల‌క్ష్మి అమ్మ వారిని ద‌ర్శించు కోవాల‌ని అనుకున్నారు. కానీ సెక్యూరిటీ కార‌ణాల రీత్యా ఆదివారం యూపీ సీఎం భారీ భ‌ద్ర‌త మ‌ధ్య అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌య‌మే చార్మినార్ వ‌ద్ద‌కు చేరుకున్నారు యోగి ఆదిత్యానాథ్. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లుచేశారు. యూపీ సీఎం(CM Yogi) తో పాటు తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ , ఎమ్మెల్యే రాజా సింగ్ తో స‌హా ప‌లువురు బీజేపీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

చార్మినార్ ప్రాంగ‌ణ‌మంతా పూర్తిగా భ‌ద్ర‌తా వ‌ల‌యంలో చిక్కుకు పోయింది.

Also Read : హైద‌రాబాద్ అద్భుత‌మైన న‌గ‌రం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!