Kola Guruvulu : విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కోలా
నియమించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
Kola Guruvulu : పార్టీ కోసం ముందు నుంచీ కష్టపడుతూ వచ్చిన విశాఖపట్టణం జిల్లాకు చెందిన కోలా గురువులు(Kola Guruvulu)కు ఎట్టకేలకు ప్రయారిటీ దక్కింది. కోలా బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. వైకాపా చీఫ్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటించడంతో కోలా గురువులకు జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జగన్ కోలా గురువులకు నియామక పత్రాన్ని అందజేశారు.
Kola Guruvulu & other MLA’s
ఇదిలా ఉండగా వైసీపీకి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో 156 మంది ఎమ్మెల్యేల బలంగా ఉంది. రాష్ట్రంలో 175 సీట్లు ఉన్నాయి. ఇక కోలా గురువులు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకు మర పడవలు, హేచరీస్ వ్యాపారం ఉంది. ప్రత్యేకించి విశాఖ పట్టణం ఓడ రేవులో పేరున్న నాయకుడు కోలా గురువులు.
ఆయన 2009లో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు కోలా. ఆయనకు రాష్ట్ర మత్స్య కార అభివృద్ది సంస్థ చైర్మన్ గా నామినేట్ చేశారు జగన్. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించు కోలేక పోయారు సీఎం. అధికార పార్టీకి చెందిన వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.
Also Read :Ayesha Naseem : పాక్ కు షాక్ అయేషా గుడ్ బై