YS Jagan : రైతన్నలకు ఆసరా జగన్ భరోసా
ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ
YS Jagan : వ్యవసాయం దండుగ కాదని అది పండుగ అని చేసి చూపించామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) మోహన్ రెడ్డి. శుక్రవారం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను సీఎం పంపిణీ చేశారు. రూ. 361.29 కోట్ల విలువ కలిగిన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు , 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను గుంటూరు నగరంలోని చుట్టుగుంట సర్కిల్ లో పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
అంతే కాకుండా రూ. 125.48 కోట్ల సబ్సిడీ సొమ్మును కంప్యూటర్ లో బటన్ నొక్కి నేరుగా రైతన్నల గ్రూపుల ఖాతాల్లోకి జమ చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. గ్రామ స్వరాజ్యానికి ఇదే నిజమైన అర్థం అని తెలిపారు.
ఇంతకు ముందు 6,535 ఆర్బీకే స్థాయిలోనూ 391 క్లస్టర్ స్థాయి లోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ప్రారంభించామన్నారు. 3,800 ట్రాక్టర్లు, 391 కంబైన్ హార్వెస్టర్లను ,22,580 ఇతర యంత్రాలను, పని ముట్లను పంపిణీ చేశామని చెప్పారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ప్రతి ఆర్బీకే స్థాయి లోనూ రూ. 15 లక్షలు కేటాయించామని చెప్పారు జగన్ రెడ్డి. 491 క్లస్టర్ స్థాయిలో వరి బాగా పండుతున్న చోట కంబైన్ హార్వెస్టర్లు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రూ. 1052 కోట్ల ఖర్చుతో ఆర్బీకేల పరిధిలో వీటిని తీసుకు వస్తున్నామని చెప్పారు. గ్రూప్ లుగా ఏర్పడిన రైతులు కేవలం 10 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు 40 శాతం ప్రభుత్వమే సబ్సిడీ భరిస్తుందని స్పష్టం చేశారు.
Also Read : MP Pritam Munde