CM YS Jagan : గ్రూప్-1,2 పోస్టులకు జగన్ గ్రీన్ సిగ్నల్
ఓకే చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
CM YS Jagan : ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పారు. ఇందుకు సంబంధించి గ్రూప్ -1 , గ్రూప్ -2 పోస్టులకు పచ్చ జెండా ఊపారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా 1,000కి పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. గురువారం ఏపీ సీఎంకు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వివరాలు ఉన్నతాధికారులు అందజేశారు. సీఎం వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఆలస్యం చేయకూడదని స్పష్టం చేశారు.
ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని ఈ సందర్బంగా సీఎంకు తెలిపారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుది దశలో ఉందని పేర్కొన్నారు. గ్రూప్ -1కి సంబంధించి 100 పోస్టులు ఉండగా గ్రూప్ -2 కు సంబంధించి 900కి పైగా ఉండవచ్చని అంచనా. మొత్తనికి వేయికి పైగా పోస్టులు భర్తీ చేసేందుకు ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమీక్షించిన ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
వీలైనంత త్వరగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి , తదితర అంశాలపై దృష్టి సారించాలని జగన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ సర్కార్ కొలువు తీరాక భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ను ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు.
Also Read : New Parliament Row