CM YS Jagan : నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ
ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చ
CM YS Jagan : ఢిల్లీ టూర్ లో ఉన్న ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan) బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ జరిగే 8వ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం. 40 నిమిషాలకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం చోటు చేసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రత్యేకంగా సీఎం ప్రస్తావించారు కేంద్ర మంత్రితో. ఏపీకి కేంద్రం సాయం చేసినందుకు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు జగన్ రెడ్డి.
2014-2015కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్ , 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ ఎదుర్కొంటున్న పర్యవసానాలు , 2021-22 లో రుణాల పరిమితిపై సడలింపులు అంశాన్ని ఆర్థిక మంత్రితో చర్చించారు ఏపీ సీఎం.
రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్ కో సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి రూ. 6,756.92 కోట్ల బకాయిల అంశాన్ని ప్రస్తావించారు. వెంటనే ఇప్పించేలా చేయాలని కోరారు. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్రంతో మాట్లాడి ఇప్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో విద్యా, ఆరోగ్య పరంగా భారీగా ఖర్చు చేశామని చెప్పారు ఏపీ సీఎం.
Also Read : Mayawati PM Modi