CM YS Jagan : కరోనాపై ఏపీ సర్కార్ అప్రమత్తం
ముందస్తు జాగ్రత్తలకు ఆదేశం
CM YS Jagan : కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది కరోనా కొత్త వేరియంట్ పై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, వీలైతే బూస్టర్ డోస్ లు వేసుకోవాలని సూచించారు.
మరో వైపు ఆయన రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇది రాజకీయంగా రాద్దాంతం అయ్యింది. ఇదే క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆస్పత్రులు, కిట్స్ సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. కోవిడ్ రూల్స్ కు సంబంధించి మరోసారి మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించింది.
చైనాలో కరోనా మరోసారి విజృంభించింది. శవాలు గుట్టలుగా పేరుకు పోయాయి. దీనిపై భారత్ అప్రమత్తమైంది. ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండాలని , ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని , భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. దీంతో ఆంధప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
ఈ మేరకు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan) కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచనలు అందజేశారు. అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లలో పరీక్షలకు సిద్దంగా చేయాలని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
ఇదిలా ఉండగా అన్ని జిల్లాల్లో కలిపి 34,763 ఆక్సిజన్ బెడ్స్ , 8,594 ఐసీయూ బెడ్స్ , 12, 292 సాధారణ బెడ్ లను సిద్దంగా ఉంచామని అధికారులు సీఎంకు తెలిపారు.
Also Read : సారు..కారు’..అప్పుల్లో షికారు – షర్మిల