CM YS Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని వీటి వల్ల పెద్ద ఎత్తున స్కిల్ కలిగిన వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తి ఎలక్ట్రానిక్ ఉత్పత్తి క్లస్టర్ లో ఆల్ డక్సన్ కంపెనీని ప్రారంభించారు సీఎం.
ఆల్ డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్ లో సర్వైలెన్స్ కెమెరాలు, డిజిటల్ రికార్డర్ , లాప్ టాప్ తయారీ కేంద్రాలను ఈ సందర్బంగా పరిశీలించారు జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం ఏర్పాట్ల గురించి, తయారీ గురించి ప్రత్యేకంగా వివరించారు. ఈ యూనిట్ వల్ల వందలాది మందికి ఉపాధి కల్పించామని జగన్ రెడ్డి(CM YS Jagan)కి వివరించారు కంపెనీ జనరల్ మేనేజర్.
కంపెనీని పరిశీలించిన అనంతరం ఏపీ సీఎం జగన్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే టూరిజం పరంగా కూడా ఫోకస్ పెట్టామన్నారు సీఎం.
పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికంగా ఉన్న యువతతో పాటు నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు జాబ్స్ వస్తాయని చెప్పారు. అందుకే కంపెనీలు ఏర్పాటు చేసే వ్యాపారవేత్తలకు సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు జగన్ రెడ్డి.
Also Read : Jana Sena Alla Nani : ఆళ్ల నానికి మతి చెడింది – జనసేన
