CM YS Jagan : ప్రచారం కోసం ప్రజల్ని చంపుతారా
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్
CM YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. తన ఫోటో షూట్ , ప్రచారం కోసం ప్రజలను చంపుతున్నాడంటూ ఆరోపించారు. రాజకీయాలను డ్రామా లాగా మార్చేసిన ఘనత బాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
ప్రజల బాగోగులు పట్టించుకోని వాళ్లు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఏపీ సీఎం. ఆయన ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. మరోసారి నిప్పులు చెరగడం విస్తు పోయేలా చేశారు. కొందరు నాయకుల తీరు విస్తు పోయేలా చేస్తోందన్నారు. ఈ భార్య కాక పోతే మరో భార్య అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు జగన్ రెడ్డి.
రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం పర్యటించారు సీఎం. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని చెప్పారు. అంతకు ముందు రూ. 986 కోట్ల విలువైన అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. రూ. 500 కోట్లతో చేపట్టే ప్రభుత్వ వైద్య కాలేజీ నిర్మాణానికి సందింటి జగన్ రెడ్డి(CM YS Jagan) శంకుస్థాపన చేశారు.
అనంతరం రూ. 470 కోట్లతో నిర్మించే తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథఖం కాలువల అనుసంధానం చేసే ప్రాజెక్టు పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. రూ. 16 కోట్లతో నర్సింపట్నం రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. మొత్తంగా బాబు, పవన్ కళ్యాణ్ ను ఒక ఆట ఆడుకున్నారు ఏపీ సీఎం.
చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే ఇంకొకరు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు జగన్ రెడ్డి. ఫోటో షూట్ కోసమే సభ పెట్టారంటూ ఆరోపించారు.
Also Read : గెలుపే లక్ష్యం బస్సు యాత్రకు సిద్దం