CM YS Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిరు వ్యాపారులకు చేదోడుగా నిలిచారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. విద్యా, ఆరోగ్య, ఉపాధి, ఫార్మా, తదితర రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు సీఎం. ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా చేశారు. ఆయన చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. వరుసగా నాలుగో ఏడాది వారికి సాయం చేశారు.
CM YS Jagan Released
మొదటి విడతగా జగనన్న తోడు కింద చేదోడుగా నిలిచారు జగన్ రెడ్డి(CM YS Jagan). దీని వల్ల చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం ఇచ్చారు. పూర్తిగా వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కొక్క చిరు వ్యాపారికి రూ. 10 వేలు అంతకు పైగా పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల 10 వేల 412 మంది చిరు వ్యాపారులకు తీపి కబురు చెప్పారు. రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశారు.
అంతే కాకుండా రూ. 11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్ మెంట్ కలిపి మొత్తం రూ. 560.73 కోట్లను తాడేపల్లిగూడెం లోని సీఎం క్యాంపు ఆఫీసు నుంచి మంగళవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
మంత్రులు ఆది మూలపు సురేష్ , కె.వి. ఉషశ్రీ చరణ్ , సీఎస్ జవహర్ రెడ్డి, స్పెష్ సీఎస్ శ్రీలక్ష్మి, అజయ్ జైన్ , బుడితి రాజశేఖర్ , సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ , తదితరులు పాల్గొన్నారు.
Also Read : Cristiano Ronaldo : యుద్ద రంగంలోకి రొనాల్డో రెడీ
