CMD Prabhakar Rao : సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా
వ్యక్తిగత కారణాల రీత్యా గుడ్ బై
CMD Prabhakar Rao : హైదరాబాద్ – రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో కొత్త సర్కార్ కొలువు తీరనుంది. దీంతో రాష్ట్ర సర్కార్ లో ఇప్పటి దాకా చక్రం తిప్పిన వాళ్లు, సీనియర్ ఆఫీసర్లు , ఇతర శాఖలకు చెందిన డైరెక్టర్లు, చైర్మన్లు , నామినేటెడ్ పదవులు పొందిన వాళ్లంతా గంప గుత్తగా రాజీనామా చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.
CMD Prabhakar Rao Resignation Viral
తాజాగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఇస్తున్న విద్యుత్ సంస్థకు బాధ్యుడిగా ఉంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్న, సీఎం కేసీఆర్ కు మద్దతుదారుగా ఉన్న సీఎండీ ప్రభాకర్ రావు(CMD Prabhakar Rao) తన పదవికి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. సోమవారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇచ్చిన రాజీనామా పత్రంలో మూడు నాలుగు వ్యాక్యాలతో సరిపుచ్చారు. ఇప్పటికే లాభాలతో ఉన్న సంస్థను కేవలం కల్వకుంట్ల కుటుంబం లాభ పడేలా, ఆయన బినామీలకు లాభాలు చేకూర్చేలా, తక్కువ ధరకు లభిస్తున్నా కాకుండా భారీ ధరకు కొనుగోలు చేస్తూ సంస్థను భ్రష్టు పట్టించారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇవాళ సీఎండీ రాజీనామాతో దెబ్బకు మిగతా ఉన్నత పదవుల్లో ఉన్న వారంతా గుడ్ బై చెప్పనున్నట్లు టాక్.
Also Read : Eatala Rajender : ప్రజా తీర్పును స్వాగతిస్తున్నా