Kiren Rijiju : కొలీజియం వ్యవస్థపై పునరాలోచించాలి
కేంద్ర న్యాయ శాఖ మంత్రి రిజిజు కామెంట్స్
Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొలీజియం నియామకాల వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అత్యున్నత న్యాయ వ్యవస్థలో నియామకాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అయితే దీనికి కారణం న్యాయ మంత్రి అనుకుంటున్నారని అది ఎంత మాత్రం కాదని స్పష్టం చేశారు కిరెన్ రిజిజు(Kiren Rijiju) .
వ్యవస్థ వల్లే ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. ఉన్నత న్యాయ వ్యవస్థలో నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు దీనిని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమర్జింగ్ లీగల్ పై రెండు రోజుల యూనియన్ ఆఫ్ ఇండియా కౌన్సెల్ (వెస్ట్ జోన్ ) సదస్సును కిరెన్ రిజిజు ప్రారంభించి ప్రసంగించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఆ విషయం అందరికీ తెలుసన్నారు.
ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానిపై తదుపరి చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. తన అభిప్రాయాలను అందరి ముందు ఉంచుతానని తెలిపారు కిరెన్ రిజిజు.
న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, ఆహ్వానితులు అంతా ఇక్కడే ఉన్నారు. వారి అభిప్రాయాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకుంటామని పేర్కొన్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి(Kiren Rijiju) .
ఈ వర్క షాప్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి, రాజస్తాన్ హైకోర్టు సీజే ఎం.ఎం. శ్రీవాస్తవ, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ , సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Also Read : బాలిక వీడియోలు లీక్ పై నిరసన