Tripura CM : వామపక్షం ఖతం కాషాయం ఖాయం – సీఎం
35 ఏళ్ల చరిత్రంతా గతమేనని కామెంట్స్
Tripura CM : త్రిపుర సీఎం డాక్టర్ మానిక్ సాహా నిప్పులు చెరిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో వామపక్ష ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య బద్దంగా భారతీయ జనతా పార్టీ ఓడించిందని ఇది రాష్ట్ర చరిత్రలో ఓ అపూర్వమైన ఘట్టమని పేర్కొన్నారు. ఒక రకంగా 35 ఏళ్ల పాటు అప్రహతితంగా పాలిస్తూ వచ్చిన కమ్యూనిస్టులకు కోలుకోలేని దెబ్బ కొట్టామన్నారు సీఎం.
దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా రాలేదన్నారు. వారి పాలనలో ప్రజలు విసిగి పోయారని , అందుకే తమను ఆదరించారని , అక్కున చేర్చుకున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రిపుర సీఎం డాక్టర్ మాణిక్ సాహా(Tripura CM) ప్రసంగించారు.
బీజేపీ సమాజంలోని చివరి వ్యక్తం కోసం పని చేస్తుందని చెప్పారు. గిరిజనుల, ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు సీఎం. త్రిపురలో 1978 నుంచి కొన్నేళ్ల పాటు పాలన సాగించింది.
కానీ జనాన్ని మభ్య పెడుతూ వచ్చారని ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులు సంత్రాలలో మునిగి పోయారని ఎద్దేవా చేశారు. మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని చెప్పారు డాక్టర్ మాణిక్ సాహా.
కమ్యూనిస్టులు ఇక్కడ హత్యలు చేశారు. హింసకు పాల్పడ్డారు. అందుకే మరోసారి వాళ్లు రావడం అనేది కల. హింసను ప్రజలు సహించరు. అభివృద్దిని, శాంతిని కోరుకుంటారు. అనేక మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టు కోవాల్సి వచ్చిందని వీరి కారణంగా రాష్ట్రం సర్వ నాశనమై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం సాహా.
Also Read : పోటీ అబద్దం మోదీతో యుద్ధం – సీఎం